: మహిళను ఆరు నెలలు జైలు పాలు చేసిన ఫేస్ బుక్ పోస్టు


ఓ మహిళను ఫేస్ బుక్ పోస్టు ఆరు నెలల పాటు జైలుపాలు చేసింది. వివరాల్లోకి వెళ్తే...మయన్మార్ లోని 'చా శాండి టున్' అనే మహిళ తన ఫేస్ బుక్ పేజిలో ఆ దేశ ఆర్మీ చీఫ్ యూనిఫాం రంగును ఆ దేశ ప్రజాస్వామ్య హక్కుల నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నేత అంగ్ సాన్ సూకీ ధరించే దుస్తులతో (లుంగీ) పోల్చుతూ 'మీరు మీ అమ్మను ప్రేమిస్తే... మీ తలపై తల్లి వస్త్రాన్ని (లుంగీని) ఎందుకు చుట్టుకోకూడదు?' అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై పెను దుమారం రేగింది. దీంతో గత అక్టోబర్ లో చా టున్ ను అరెస్టు చేశారు. కాగా, తాజాగా ఆమె తరపు న్యాయవాది తన క్లయింటు నిరపరాధి అని, ఆమె ఫేస్ బుక్ పేజ్ హ్యాకింగ్ కు గురైందని, ఆ పోస్టును ఎవరో పెట్టారని న్యాయస్థానంలో వాదించారు. న్యాయవాది వాదనతో ఏకీభవించని న్యాయస్థానం ఆమెను దోషిగా ఖరారు చేస్తూ ఆరు నెలల కారాగార శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News