: టార్గెట్ మోదీయే... పాక్ తో సంబంధాలు ఇష్టం లేకనే!
ఇండియాపై ఏ సమయంలోనైనా దాడి చేసేందుకు సిద్ధమైన పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రధాని మోదీని టార్గెట్ చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్ దేశంలో మోదీ అకస్మాత్తుగా కాలుమోపడం, ఆ దేశంతో శాంతి సంబంధాల విషయంలో ఇండియా అడుగులు వేయడం ఇష్టంలేని ఉగ్రవాదులు ప్రధానిని హతమార్చాలని ప్లాన్లు వేస్తున్నాయని తెలిపాయి. ప్రధాని మోదీ నివాసం, భారత పార్లమెంటుతో పాటు సైనిక కార్యాలయాలు, అణు కేంద్రాలు, ప్రధాన నగరాల్లోని జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రదేశాలు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన నిఘా వర్గాలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.