: కొణతాల చేరికపై అసంతృప్తి సహజమే: గంటా
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ పార్టీ మార్పుపై మంత్రి గంటా శ్రీనివాసరావు తొలిసారి స్పందించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, కొణతాల టీడీపీలో చేరికపై పార్టీ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. అనకాపల్లిలో టీడీపీ కార్యకర్తలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. స్థానిక కార్యకర్తలకు, కొణతాలకు మధ్య విభేదాలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే ఆయనను వారు వ్యతిరేకిస్తున్నారని గంటా వెల్లడించారు. అయితే పార్టీ నిర్ణయమే అంతిమమని, దానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.