: దేశంలో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం... ఐబీ హెచ్చరిక


కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ నుంచి 15-20 మంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని నిఘావర్గాలు పేర్కొన్నాయి. సైనిక, అణుసంబంధిత ప్రాంతాల్లో, ప్రధాని, సీఎం నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని చెప్పాయి. ముంబయి దాడుల తరహాలో దాడులకు పాల్పడవచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో భద్రత కట్టుదిట్టం చేయాలని, అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాలని హెచ్చరికలు జారీ చేశాయి.

  • Loading...

More Telugu News