: కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయలేము: తెలంగాణ సర్కారు


తెలంగాణలోని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉదయం మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించిన హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సేవలందిస్తున్న ఆసుపత్రులను ఆధునికీకరిస్తామని వెల్లడించిన ఆయన, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న వారి సమస్యలను పరిష్కరిస్తామని, అంతమాత్రాన వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబోరని అన్నారు.

  • Loading...

More Telugu News