: కార్లపై ‘బుగ్గ’లను పీకేసిన నీతీశ్ కుమార్... ఇక సైలెంట్ గానే వీఐపీల కార్లు


ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా సరి-బేసి పేరిట కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇదే రీతిలో బీహార్ రాజధాని పాట్నాలోనూ శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏకంగా బుగ్గ కార్లకే వీడ్కోలు పలకన్నారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఒక్క గవర్నర్ మినహా ఏ ఒక్క వీఐపీ కూడా బుగ్గ కారును వాడటానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు. అయినా నితీశ్ కుమార్ ఉన్నపళంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమిటంటే, బుగ్గ కార్లలో వెళ్లే వీఐపీలు స్కూళ్లు, ఆసుపత్రుల సమీపంలోనూ పెద్ద పెద్ద సైరన్లతో రయ్యిమని దూసుకెళుతున్నారట. దీంతో శబ్ద కాలుష్యంతో సతమతమవుతున్నామని అటు పాఠశాలల నుంచే కాక ఇటు ఆసుపత్రుల సిబ్బంది నుంచి కూడా నితీశ్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతోనే బుగ్గ కార్ల వినియోగానికి చెక్ పెడుతూ నితీశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై గవర్నర్ కాన్వాయ్ తో పాటు ఫైరింజన్లు, అంబులెన్స్ లపై మాత్రమే పాట్నాలో బ్లూ, ఎరుపు రంగుల్లో బుగ్గలు కనిపిస్తాయి.

  • Loading...

More Telugu News