: అమరావతి టౌన్ షిప్ లో సచివాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి టౌన్ షిప్ లో తాత్కాలిక సచివాయం నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం పూర్తి చేయాలని తెలిపింది. రూ.180 కోట్లతో 6 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. వచ్చే ఏడాది జూన్ 30లోపు భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని సీఆర్డీఏకి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణ నిధుల్లో రూ.90 కోట్ల ప్రభుత్వ వడ్డీలేని రుణం, మరో రూ.90 కోట్లు హడ్కో రుణం కింద విడుదల చేయనున్నారు.