: పెళ్లికి ఒప్పుకోని ప్రియురాలి గొంతు కోసి, ఆసుపత్రిలో చేర్చి, ఆత్మహత్య!


మనసారా ప్రేమించిన ప్రియురాలు వివాహం చేసుకునేందుకు ఒప్పుకోవడం లేదన్న కోపంతో, క్షణికావేశానికి లోనైన ఓ యువకుడు, ఆమె గొంతు కోసి, ఆపై ఆసుపత్రిలో చేర్చి, అదే భవంతిపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాంచీ పరిధిలోని పుందాంగ్ సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అమిత్ (29) అనే యువకుడు, తన స్నేహితురాలిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. చాలా సార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినా, యువతి నిరాకరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో మరోసారి మాట్లాడుకునేందుకు రమ్మన్న అమిత్, వాగ్వాదం పెరగడంతో బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రియురాలిని ఆసుపత్రికి చేర్చి, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఆపై ఆసుపత్రి పైకి ఎక్కి, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News