: ఆన్ లైన్ అడ్మిషన్లు చేపట్టాలని వర్సిటీలను కోరిన యూజీసీ
దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోను వచ్చే వార్షిక సంవత్సరం నుంచి ఆన్ లైన్ పద్ధతిలో అడ్మిషన్లు చేపట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కోరింది. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్ వేద్ ప్రకాశ్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు లేఖ రాశారు. ప్రతి కోర్సుకూ ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్లు జరపాలని, అంతేగాక ఆ దిశగా చేపట్టిన చర్యలను యూజీసీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆన్ లైన్ అడ్మిషన్ పద్ధతి ద్వారా విద్యా సంస్థల పారదర్శకత పెరుగుతుందని, విద్యార్థులు కూడా తమ ఆప్షన్ ను ఎన్నుకోవడం సులువవుతుందని యూజీసీ అభిప్రాయపడింది. వచ్చే నెలలో జరగనున్న యూజీసీ సమావేశంలో ఆన్ లైన్ అడ్మిషన్ ప్రక్రియపై వివిధ వర్సిటీల పనితీరును సమీక్షించనున్నారు.