: నేను తప్ప షారుఖ్ కుమారుడిని మరెవరూ లాంచ్ చేయలేరు: కరణ్ జోహార్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో తనది చాలా క్లోజ్ రిలేషన్ షిప్ అని... ఇప్పుడు అదే రిలేషన్ షిప్ ను అతని వారసులతో కూడా కంటిన్యూ చేస్తున్నానని ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అన్నాడు. షారుఖ్ కుమారుడు ఆర్యన్ ను హీరోగా పరిచయం చేస్తానని... తాను తప్ప ఆర్యన్ ను మరెవరూ లాంచ్ చేయలేరని తెలిపాడు. షారుఖ్ విషయంలోనే కాదు, ఆయన వారసుడి విషయంలో కూడా తానే బెస్ట్ అని చెప్పాడు. మరోవైపు, ఆర్యన్ లండన్ లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నాడు. అడపాదడపా సినిమా ఫంక్షన్లలో దర్శనమిస్తుంటాడు.