: అమెరికాలో చదివే విద్యార్థులకు హెచ్చరిక


తమ దేశంలో చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులపై అమెరికా పక్కాగా నిఘా పెడుతోంది. చదువు పేరుతో తమ దేశానికి వచ్చి, పార్ట్ టైమ్ జాబ్ లు చేసుకుంటున్న విద్యార్థులపై ఉక్కు పాదం మోపుతోంది. అక్కడి ఫెడరల్ పోలీసు డిపార్ట్ మెంట్ పలు ప్రాంతాల్లో తనఖీలు చేసింది. ఈ క్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారని గుర్తించింది. వీరందరినీ స్వదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించిందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. 150 మంది విద్యార్థుల్లో 38 మంది తెలుగు వారు కూడా ఉన్నారనే సమాచారం మరింత ఆందోళన కలిగిస్తోంది. సరైన ఆర్థిక వనరులు లేని వారు అమెరికాకు రాకూడదని అక్కడి పోలీసులు స్పష్టం చేసినట్టు సమాచారం. సో... ఇకపై అమెరికాలో చదుకోవాలనుకుంటున్న విద్యార్థులు... తమ ఆర్థిక స్తోమత బాగుంటేనే అక్కడకు వెళ్లడం మంచిది. ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ జాబ్ లకు స్వస్తి పలికి, పూర్తి సమయాన్ని చదువుకే కేటాయించడం బెటర్. లేకపోతే, బంగారు కలలు కరిగిపోయే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News