: దుబాయ్ లో భారతీయుడికి మరణశిక్ష... క్షమాభిక్షకు ససేమిరా!


ప్రేమించి పెళ్లి చేసుకుని, విదేశాలకు తీసుకెళ్లి, ఆపై తన భార్యను దారుణంగా హత్య చేసిన నేరానికి ముంబైకి చెందిన ఆతిఫ్ పొపీరే అనే యువకుడికి సౌదీ కోర్టు మరణశిక్ష విధించింది. అతన్ని తుపాకులతో కాల్చి చంపాలని ఆదేశించింది. 2013లో హత్య జరుగగా, తనకు క్షమాభిక్ష పెట్టాలని ఆతిఫ్ చేసుకున్న దరఖాస్తున్న దుబాయ్ అత్యున్నత న్యాయస్థానం గతవారంలో తిరస్కరించింది. ఇక చావును తప్పించుకునేందుకు ఆతిఫ్ ముందు ఉన్న ఒకే ఒక్క దారి... బాధితుల కుటుంబీకుల నుంచి క్షమాభిక్ష. అయితే, ఆతిఫ్ భార్య బస్రా తల్లి ఉమా ధనుజయన్ మాత్రం, అది జరిగే పని కాదని స్పష్టం చేశారు. క్షమాభిక్ష కావాలని తననెవరూ సంప్రదించలేదని, ఒకవేళ వచ్చినా తాను అంగీకరించబోనని వెల్లడించారు. కాగా, ఉమ కుమార్తె మినీ ధనుంజయన్, ముంబైలోని మాతుంగా కాలేజీలో చదువుతున్న సమయంలో ఆతిఫ్ పరిచయం అయ్యాడు. ఆపై వారు ప్రేమించుకుని, 2008లో పెళ్లి చేసుకోగా, మినీ తన పేరును బస్రాగా మార్చుకుంది. దుబాయ్ లోని ఓ షాపులో మేనేజర్ గా ఉద్యోగం రావడంతో ఆతిఫ్ తొలుత, ఆపై రెండేళ్లకు బస్రా దుబాయ్ వెళ్లింది. జీవితాంతమూ కలిసుంటాడని నమ్మిన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. "నా కుమార్తె మరణం తరువాత, అతను ఎలా శిక్షింపబడతాడో చూసేందుకు మాత్రమే నేను బతికున్నాను. అతనికి మరణమే సరైన శిక్ష" అని ఉమ ఆగ్రహంతో చెబుతున్నారు.

  • Loading...

More Telugu News