: చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను సత్య నాదెళ్ల ముద్దు చేసిన వేళ..!
మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల హైదరాబాద్ లోని చంద్రబాబునాయుడు ఇంటికి వచ్చిన వేళ, అక్కడే ఉన్న ఆయన మనవడు దేవాన్ష్ తో కాసేపు ఆడుకున్నారు. బ్లూ కలర్ టీషర్టు, తెల్ల డ్రాయర్, వైలెట్ కలర్ టోపీ వేసుకున్న దేవాన్ష్ సైతం, కొత్తవాడన్న బెరుకు ఏ మాత్రం లేకుండా సత్య నాదెళ్ల చంకెక్కేశాడు. ఆ సమయంలో సత్య సైతం ఆశ్చర్యపోగా, ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దేవాన్ష్ ను కొద్ది సేపు ముద్దుచేసిన సత్య, కాసేపు అన్నీ మరచి సేదదీరారు. ఇక మీ మాతృభూమి రుణం తీర్చకునే సమయం వచ్చిందని చంద్రబాబు సత్య నాదెళ్లకు సూచించారు. తదుపరి వచ్చినప్పుడు స్వగ్రామాన్ని, అనంతపురం జిల్లాను సందర్శించాలని, రాష్ట్ర యువతను ఉద్దేశించి ప్రసంగించాలని కోరారు. దీనికి సత్య నాదెళ్ల సైతం సానుకూలంగా స్పందించారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్న బాబు కోరిక ఫలించాలని కోరుతున్నట్టు తెలిపారు.