: కడప ఖైదీల పరారీపై చినరాజప్ప ఆగ్రహం... సమగ్ర విచారణకు ఆదేశం
కడప కేంద్ర కారాగారం నుంచి నిన్న నలుగురు ఖైదీల పరారీపై ఏపీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందన్న ప్రాథమిక సమాచారంతో నేటి ఉదయం ఆయన పోలీసు అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఇప్పటికే పోలీసు బాసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.