: సీఎం ఆఫీస్ నుంచి అభీష్ట ఔట్!... లోకేశ్ క్లాస్ మేట్ రాజీనామాకు ఏపీ సర్కారు ఆమోదం
ఎస్.అభీష్ట... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు క్లాస్ మేట్. ఈ కారణంగానే ఆ 35 ఏళ్ల యువకుడిని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమించుకున్నారంటూ ఆమధ్య విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఉన్నత విద్యావంతుడైన అభీష్ట, తనలోని సత్తా ఆధారంగానే ఆ పోస్టుకు ఎంపికయ్యారని ఆ తర్వాత అంతా సర్దిచెప్పుకున్నారు. అయితే సదరు పోస్టుకు అభీష్ట మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓ నుంచి బయటకు వచ్చిన అభీష్ట ఇకపై టీడీపీ కార్యకలాపాల్లో కీలక భూమిక పోషించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.