: యుద్ధం వల్ల వచ్చేదేమీ లేదన్న మోదీ.... మా బాగా చెప్పారని కీర్తించిన నవాజ్


భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ నగరం లాహోర్ పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, అప్ఘనిస్థాన్ పర్యటన ముగించుకుని తిరుగు పయనమవడానికి కొద్ది గంటల ముందు ఖరారైన లాహోర్ పర్యటనపై విశ్వవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. ఈ పర్యటనపై పలు ఆసక్తికర కథనాలు కూడా వెలువడుతున్నాయి. రెండు గంటల పాటు లాహోర్ శివారులోని నవాజ్ ఇంటిలో గడిపిన మోదీ, ఎలా గడిపారన్న విషయంపైనే నిన్నటిదాకా కథనాలు రాగా, తాజాగా నవాజ్ షరీఫ్ తో మోదీ అన్న మాటలను ఊటంకిస్తూ ‘ఫస్ట్ పోస్ట్’ అనే ఓ ఆన్ లైన్ పోర్టల్ ఓ ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. నవాజ్ తో పాటు ఆయన సోదరుడు, ఆ దేశంలోని పంజాబ్ రాష్ట్ర సీఎం షాబాద్ షరీఫ్ లతో మాట్లాడిన సందర్భంగా మోదీ యుద్ధాన్ని ప్రస్తావించారు. ‘‘యుద్ధం వల్ల ఏం వస్తుంది? భూమి రాదు, స్వర్గం కూడా రాదు’’ అని మోదీ పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలతో అంగీకరించిన షరీఫ్ బ్రదర్స్ ‘‘వెల్ సెడ్’’ అంటూ చాలా బాగా చెప్పారని మోదీని కీర్తించారట.

  • Loading...

More Telugu News