: రైలులో దారుణానికి పాల్పడ్డ భారత్ జవాన్లు!


హౌరా-అమృతసర్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న భారత జవాన్లు ఒక బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఈరోజు జరిగిన ఈ సంఘటన వివరాలు.. తన స్నేహితురాలిని కలిసేందుకని లూథియానాకు వెళుతున్న ఒక బాలిక హౌరా స్టేషన్ లో ఈ ఎక్స్ ప్రెస్ రైలును ఎక్కింది. పొరపాటున ఆర్మీ కంపార్టుమెంట్ లో ఉన్న సీట్లలో కూర్చుంది. ఆ బోగీలో ఉన్న ఆర్మీ జవాన్లు మద్యం తాగమని ఆ బాలికను కోరడంతో.. కొద్దిగా మద్యం సేవించింది. ఆ తర్వాత ముగ్గురు జవాన్లు బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన అనంతరం జార్ఖండ్ దియోగఢ్ జిల్లాలో ఉన్న మధుపూర్ స్టేషన్ లో ఆ బాలిక దిగిపోయింది. అక్కడి రైల్వే పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించి ఒక జవాన్ ని అరెస్టు చేశామని, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. కాగా, ఈ సంఘటనపై మిలిటరీ అధికారులెవరూ ఇంతవరకూ స్పందించలేదు.

  • Loading...

More Telugu News