: కడప సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరారీ!
కడప సెంట్రల్ జైలు నుంచి నలుగురు జీవిత ఖైదీలు పరారయ్యారు. సోమవారం నాడు జైలు గోడకు కన్నం వేసి ఈ నలుగురు ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. వీరిని దేవ, రామచంద్ర, హనుమంతు, రవిగా గుర్తించారు. దీంతో, కంగుతిన్న జైలు అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే, ఈ విషయాన్ని జైలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.