: జేఎన్ యూకు బాబా రాందేవ్ ను ఆహ్వానించవద్దు: విద్యార్థుల డిమాండ్


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్ యు)లో జరుగుతున్న ‘22వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ వేదాంత’ కార్యక్రమానికి యోగా గురువు బాబా రాందేవ్ ను ఆహ్వానించవద్దని వర్శిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న ప్రారంభమైన ఈ కార్యక్రమం 30వ తేదీతో ముగియనుంది. చివరి రోజు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసకుడుగా రావాలంటూ బాబా రాందేవ్ ను వర్శిటీ అధికారులు ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. నాలెడ్జికి కేంద్రమైన జెఎన్ యు వంటి విద్యాలయంలో రాందేవ్ వంటివారికి ఉపన్యసించే అర్హత లేదని జేడి(యు) నేత కేసీ త్యాగి ఆరోపించారు. వర్శిటీని కాషాయీకరణ చేసేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాందేవ్ ఆహ్వానించడాన్ని ఉపసంహరించుకోవాలని వర్శిటీలోని ఒక వర్గానికి చెందిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News