: చంద్రబాబు అంటే బిల్ గేట్స్ కు ప్రత్యేక అభిమానం ఉందని సత్య నాదెళ్ల చెప్పారు: మంత్రి పల్లె
ముఖ్యమంత్రి చంద్రబాబుపై సాఫ్ట్ వేర్ దిగ్గజం బిల్ గేట్స్ కు ప్రత్యేక అభిమానం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. చంద్రబాబుతో సత్య నాదెళ్ల భేటీ చారిత్రాత్మకమైనదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల చెప్పారని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో మైక్రోసాఫ్ట్ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారని అన్నారు. అనంతపురం జిల్లాలో కూడా పర్యటించాలన్న తన కోరికను సత్య నాదెళ్ల అంగీకరించారని తెలిపారు.