: అతనికి 91, ఆమెకు 96... అయితేనేం, పెళ్లి చేసుకోబోతున్నారు!


రిటైర్డ్ ఇంజినీర్ బిల్ వయసు 91 సంవత్సరాలు. అతని స్నేహితురాలు ఫ్లో వయసు 96 ఏళ్లు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. పిల్లలు, మనవలు, మునిమనవలు ఉన్నారు. అతని భార్య, ఆమె భర్త ఇద్దరూ చనిపోయారు. గత పదేళ్ల నుంచి కలసి బతుకుతున్న నేపథ్యంలో, ఫ్లోను పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగింది బిల్ కు. ఇదే విషయాన్ని 60 ఏళ్ల కుమారుడికి చెప్పాడు. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కుమారుడు. దీంతో, తన ప్రియురాలు ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచాడు. ఆమె కూడా ఆనందంగా ఓకే చెప్పడంతో... పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. కొత్త సంవత్సరంలో జనవరి 16న వీరిద్దరూ ఒకింటివారు కాబోతున్నారు. వీరిద్దరూ ఇంగ్లాండ్ లోని వెస్ట్ మిడ్ ల్యాండ్ కు చెందిన వారు. ఫ్లో సొంత భవనంలో పబ్ ఉండేది. అక్కడే వీరిద్దరికీ పరిచయం. ఇద్దరూ కలసి డ్యాన్స్ చేసేవారు. బిల్ భార్య చనిపోయాక ఆయనకు ఫ్లో తోడుగా ఉంటోంది. గత 20 ఏళ్లుగా ఫ్లోను చూస్తున్నానని... ఆమెది ప్రేమను పంచే మనసని బిల్ అంటున్నాడు. పెళ్లికి ఫ్లో అంగీకరించడం తన అదృష్టమని తెలిపాడు. మరోవైపు, అతి పెద్ద వయసు వధూవరులుగా వీరు గిన్నిస్ రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News