: ఈ ఏడాదిలోనే వెలుగుల తోకచుక్క ఐసాన్
అమెరికా వారి అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా ఓ కొత్త, అతిపెద్దదైన తోకచుక్కను గుర్తించింది. నాసా వారి హబుల్ టెలిస్కోపు ద్వారా గుర్తించిన ఈ తోకచుక్కకు ఐసాన్ అని పేరు పెట్టారు. దీని చిత్రాలను కూడా హబుల్ టెలిస్కోపు సేకరించింది. ఇది వెలుగులు చిమ్మే తోకచుక్క అని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ఏడాది చివరి సమయానికి ఈ ఐసాన్ వెలుగులు వెదజల్లుతుందని, అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క అవుతుందని వారు అనుకుంటున్నారు. 2012లోనే రష్యన్ వ్యోమగాములు కూడా తొలిసారిగా ఈ తోకచుక్కను గమనించారు. దీనియొక్క మరింత స్పష్టమైన చిత్రాలను హబుల్ టెలిస్కోపు ఈనెల 10న చిత్రించింది.