: రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్: ఎన్నికల అధికారి నాగిరెడ్డి
రెండు, మూడు రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని ఎన్నికల అధికారి నాగిరెడ్డి వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువులోగా గ్రేటర్ ఎన్నికలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. జంట నగరాల్లో ఓటింగ్ శాతం పెరగడం లేదని, ఓటింగ్ శాతం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. యాప్ ద్వారా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలను తెలుసుకోవచ్చని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. వార్డుల రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుందన్న నాగిరెడ్డి, గ్రేటర్ ఎన్నికల్లో అథారిటీ అంతా జీహెచ్ఎంసీ కమిషనర్ దే అని తెలిపారు.