: యూరప్ పర్యటనకు వెళుతున్నా: ట్విట్టర్ లో రాహుల్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. "కొన్ని రోజుల పాటు నేను యూరప్ వెళుతున్నా. ప్రతి ఒక్కరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు" అని తెలిపారు. మరో ట్వీట్ లో "కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలను తేవాలని కోరుకుంటున్నా" అని రాహుల్ ట్వీట్ చేశారు. అయితే యూరప్ ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఎన్ని రోజులపాటు ఆయన పర్యటన ఉంటుందన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా కొత్త సంవత్సర వేడుకలను ఆయన యూరప్ లో జరుపుకుంటారని స్పష్టమవుతోంది.

  • Loading...

More Telugu News