: రాహుల్ పై అక్రమ కేసులు పెట్టేందుకు కేంద్రం కుట్ర: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీజేపీ చేపడుతున్న విధానాలు దేశాన్ని మత ప్రాతిపదికన విచ్ఛిన్నం చేసేందుకు దోహద పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మోదీ అనుసరిస్తున్న విధానాలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమయిందని... కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. మరోవైపు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి టీఆర్ఎస్ యత్నిస్తోందని... ఆ ప్రయత్నాలను ఎదుర్కోవాలని చెప్పారు.