: ఇదో కొత్త రకం ఉగ్రవాదం: ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు
పాలస్తీనా వాసులు ఇజ్రాయిల్ పై కొత్త రకం ఉగ్రవాద చర్యలకు దిగుతున్నారని ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వ్యాఖ్యానించారు. పౌరులే ఉగ్రవాద చర్యలకు దిగుతున్నారని, ఇది రెండు ప్రాంతాలకూ మంచిది కాదని ఆయన అన్నారు. నిత్యమూ పాలస్తీనా సైన్యం ఇజ్రాయిల్ పై దాడులు చేస్తుండటం చూస్తున్నదే అయినా, గత కొంతకాలంగా పాలస్తీనీయులు వంటకు వాడే చాకులనే ఆయుధాలుగా వాడుతూ దాడులకు దిగుతున్నారు. కుటుంబమంతా కలసి కారులో వెళ్తున్నట్టుగా వచ్చి యాక్సిడెంట్లు చేసి పారిపోతున్నారు. గడచిన మూడు నెలల కాలంలో ఈ తరహా ఘటనలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ ఘటనలతో ఇజ్రాయిల్ వాసుల్లో కోపం కట్టలు తెంచుకుంటుండగా, పరిస్థితులు మరింతగా దిగజారకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్టు నెతన్యాహూ తెలిపారు.