: 'అమ్మాయిలను నమ్మకండి' అంటూ రాసి, టెక్కీ ఆత్మహత్య


ప్రేమ విఫలమైన ఓ ఇంజనీరింగ్ టెక్నాలజీ విద్యార్థి బలవంతంగా తనువు చాలించిన ఘటన హైదరాబాద్ పరిధిలోని నిజాంపేట కేటీఆర్ కాలనీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గల్లా సుధీర్ (21) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఉద్యోగాన్వేషణలో భాగంగా హైదరాబాద్ లో ఉంటున్న సుధీర్, ఓ యువతిని ప్రేమించాడు. ఆమె మోసం చేయడంతో సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. చనిపోయే ముందు 'నాకు అమ్మాయిల మీద విరక్తి పుట్టింది.. నన్ను ఓ అమ్మాయి మోసం చేసింది. అమ్మాయిలంతా అంతే. అమ్మాయిలను నమ్మకండి' అని గోడలపై రాశాడు. ఈ ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News