: గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 131 ఏళ్లు నిండాయి!... వేడుకలకు డుమ్మా కొట్టిన రాహుల్ గాంధీ


దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా వినుతికెక్కిన కాంగ్రెస్ పార్టీకి నేటితో 131 ఏళ్లు నిండాయి. స్వాతంత్ర్యం కోసం సాగించాల్సిన పోరు కోసం పురుడుపోసుకున్న ఆ పార్టీ ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించుకుంది. బ్రిటిష్ పాలకులను దేశం నుంచి తరిమికొట్టింది. ఆ తర్వాత స్వత్రంత్ర భారతంలో సుదీర్ఘ ప్రస్థానం సాగించిన ఆ పార్టీకి మెజారిటీ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకలా సాగగా, మరికొన్ని సార్లు తల బొప్పికట్టే ప్రజా తీర్పులూ ఎదురయ్యాయి. 131వ ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, ఆ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రధాని పదవి అలకంరించనున్న పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఈ వేడుకలకు డుమ్మా కొట్టారు.

  • Loading...

More Telugu News