: ఉతికి ఆరేసిన గుప్టిల్... 30 బంతుల్లో 93 పరుగులు


న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఇందులో 8 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. గుప్టిల్ 'హీరో'చిత ఇన్నింగ్స్ ను శ్రీలంక బౌలర్లు, ఫీల్డర్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఈ క్రమంలో, క్రైస్ట్ చర్చ్ లో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంకపై న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 27.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. కులశేఖర 19 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెన్రీ 4, మెక్ క్లీనగహన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 118 పరుగుల విజయ లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 8.2 ఓవర్లలో ఛేదించింది. టీ20 తరహాలో గుప్టిల్ చెలరేగి ఆడాడు. 17 బంతుల్లోనే 4 సిక్సర్లు, 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రికార్డు సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది.

  • Loading...

More Telugu News