: చంద్రబాబు విజయవాడకు బయలుదేరిన వేళ, రాజ్ భవన్ కు ఏపీ మంత్రులు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడకు బయలుదేరిన తరువాత, ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్ బాబు రాజ్ భవన్ కు చేరుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. రేపు అనంతపురం జిల్లాలో ప్రారంభమయ్యే నీరు-ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ ను ఆహ్వానించారు. ఏపీ మంత్రుల ఆహ్వానానికి నరసింహన్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కాగా, ఈ ఉదయం మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత, చంద్రబాబునాయుడు విజయవాడకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి చంద్రబాబే స్వయంగా గవర్నర్ ను కలుస్తారని భావించినప్పటికీ, విజయవాడలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వున్నందున గవర్నర్ ను ఆహ్వానించే బాధ్యతను అందుబాటులో ఉన్న మంత్రులకు అప్పగించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News