: టి.హబ్ సందర్శించిన సత్య నాదెళ్ల... స్వాగతం పలికిన కేటీఆర్
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల హైదరాబాద్ లోని టి.హబ్ ను సందర్శించారు. ముందుగానే అక్కడికి చేరుకున్న ఐటీ మంత్రి కేటీఆర్, ఇతర ఉన్నతాధికారులు నాదెళ్లకు ఘన స్వాగతం పలికారు. అనంతరం టి.హబ్ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హబ్ విశిష్టత, ఏర్పాట్ల వివరాలను ఆయనకు కేటీఆర్ వివరించారు. తరువాత జరిగిన సమావేశంలో స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాదెళ్ల, టి.హబ్ తో కలసి మైక్రోసాఫ్ట్ పని చేస్తుందని చెప్పారు. యాక్సిలేటర్లు, స్టార్టప్ ల అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని తెలిపారు. ఐటీలో భారతీయుల నైపుణ్యం క్రమంగా పెరుగుతోందన్న ఆయన, త్వరలో ఐటీ రంగంలో ఆధిపత్యం వహిస్తారని పేర్కొన్నారు.