: 'అఖండ భారత్' వివాదం... ఇప్పట్లో అసంభవమన్న ఆర్ఎస్ఎస్


పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండియాలు తిరిగి కలుస్తాయని, అఖండ భారత్ ఏర్పడుతుందని బీజేపీ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. "ఇప్పటికిప్పుడు అఖండ భారత్ సాధ్యం కాదు. బహుశా రాంమాధవ్ వ్యాఖ్యలు సాంస్కృతిక ఏకత్వానికి సంబంధించినవై ఉండవచ్చు. రాజకీయ కోణం కాదని నేను అనుకుంటున్నా" అని ఆర్ఎస్ఎస్ నేత రాకేష్ సిన్హా వ్యాఖ్యానించారు. "పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రజలు, ఇస్లాం పాలకులు ఇక్కడికి రాకముందు ఉన్న భారత సంస్కృతి, సంప్రదాయాలను అంగీకరిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతానికి అది అసంభవం" అని వివరించారు. కాగా, అల్ జజీరా ఇంటర్నేషనల్ న్యూస్ నెట్ వర్క్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, "వందల ఏళ్ల చరిత్ర ఉండి, కేవలం 60 ఏళ్ల నాడు మాత్రమే విడిపోయిన ఈ ప్రాంతాలు చారిత్రక అవసరాల కోసం తిరిగి కలుస్తాయని భావిస్తున్నా. ఓ ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా నేనూ అదే కోరుకుంటున్నా" అని రాంమాధవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మోదీ పాక్ పర్యటనకు వెళ్లిన తరువాత రాంమాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

  • Loading...

More Telugu News