: ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో సంబరం ప్రారంభం!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రం ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో సుమ యాంకరింగ్ తో ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం కళాకారుల డ్యాన్స్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోంది. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ పాటలను అందించారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

  • Loading...

More Telugu News