: మనవడిని చూసి పొంగిపోయిన కేసీఆర్!
మనవడిని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొంగిపోయారు. అయుత చండీ మహాయాగం అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘నా మనవడు ఉన్నాడు. నేను సాష్టాంగ నమస్కారం చేస్తే.. ఆ అబ్బాయి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మీ మనవడికి కూడా మీ సంస్కారం నేర్పిస్తున్నారని నాతో అయ్యగార్లు చెప్పినారు. మీ తరానికి.. ముందుతరానికి ఈ సంస్కారం నేర్పిస్తుండటం శుభం అంటూ ఆశీర్వదించారు. నాకు చాలా సంతోషం కల్గింది.. నా మనవడికి కూడా మీ అందరి ఆశీస్సులు లభించినయి’ అని ఆయన అన్నారు. ఈ సమయంలో ఆయన పక్కనే కొడుకు కేటీఆర్, మనవడు ఉన్నారు. కేసీఆర్ తన మనవడి గురించి చెప్పగానే అతను నమస్కారం చేశాడు.