: యాగశాల సంప్రోక్షణ..మహా పూర్ణాహుతికి చురుగ్గా ఏర్పాట్లు: ఎంపీ బాల్కసుమన్


అయుత మహా చండీయాగం యాగశాల సంప్రోక్షణ ప్రారంభమైందని ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. పూర్ణాహుతి తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతాయని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం విరామ సమయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సంప్రోక్షణ అనంతరం అయుత మహాచండీయాగం మహా పూర్ణాహుతి కోసం ఏర్పాట్లు త్వరితగతిన జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. మహాపూర్ణాహుతి కార్యక్రమానికి గవర్నర్ దంపతులు హాజరుకానున్నారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ఈ కార్యక్రమానికి హాజరుకావట్లేదు. భద్రతా కారణాల రీత్యానే ఆయన ఇక్కడికి హాజరుకావట్లేదని సమాచారం.

  • Loading...

More Telugu News