: రాష్ట్రపతి ప్రణబ్ ‘ఎర్రవల్లి’ పర్యటన రద్దు!


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ఎర్రవల్లి’ పర్యటన రద్దయింది. అయుత మహా చండీయాగం యాగశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఆయన పర్యటన రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రణబ్ పర్యటన రద్దయినట్లు సమాచారం. కాగా, యాగశాల పైకప్పుకు నిప్పంటుకోవడంతో యాగాన్ని మధ్యలో వదలిన రుత్విక్కులు తలోదిక్కుకు పారిపోయారు. వెంటనే అక్కడే ఉన్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అనంతర యాగ కార్యక్రమాలను కొనసాగించేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News