: మహా చండికి అర్పితమైన కనకదుర్గమ్మ కానుకలివే!
అయుత మహా చండీయాగానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బెజవాడ కనకదుర్గమ్మ తరఫున తీసుకువచ్చిన కానుకలను భక్తి శ్రద్ధలతో ప్రధాన హోమగుండంలో సమర్పించారు. కనకదుర్గమ్మ కానుకలను ఒక్కొక్కటిగా, మంత్రి గంటా శ్రీనివాస్, చంద్రబాబుకు అందిస్తుంటే, వాటిని చంద్రబాబునాయుడు స్వయంగా కేసీఆర్ కు అందించారు. ఆపై కేసీఆర్ వాటిని మహాచండికి నైవేద్యంగా అందించారు. మూడు డజన్లకు పైగా అరటిపండ్లు, పట్టు చీర, పసుపు, కుంకుమ ఇతర పూజా ద్రవ్యాలను హోమగుండంలో వదిలారు. ఆపై ఇద్దరు నేతలూ హోమగుండంలో ఆవు నెయ్యిని పోస్తూ, కానుకలన్నీ అమ్మవారికి చేరేలా అగ్నిదేవుని సాయం కోరారు.