: రాధిక వివరణ ఇచ్చి తీరాలంటున్న నాజర్!
నటుడు శింబు పోలీసు కేసుల్లో చిక్కుకున్న వేళ, నడిగర సంఘం ఎటువంటి సహాయమూ చేయడం లేదని నటి రాధిక చేస్తున్న ఆరోపణలపై సంఘం నేతలు మండిపడ్డారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన బీప్ సాంగ్ పై తాము ఇప్పటికే శింబుతో మాట్లాడామని, వారే స్వయంగా కోర్టులో విషయం తేల్చుకుంటామని తమకు స్పష్టం చేశారని సంఘం అధ్యక్షుడు నాజర్ తెలిపారు. ఈ విషయమై రాధిక చేస్తున్న ఆరోపణలు అసత్యమని అన్నారు. నడిగర సంఘంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నందున నటి రాధికకు నోటీసులు జారీ చేయనున్నామని, ఆమె తమ నోటీసులకు సమాధానం చెప్పే తీరాలని అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం సభ్యుల్లో ప్రతి ఒక్కరికీ తాము అండగా ఉంటామని, బీప్ సాంగ్ కారణంగా శింబును బహిష్కరించలేమని తెలిపారు.