: ఆఖరి దశకు అయుతం... నేడు రాష్ట్రపతి, చంద్రబాబు రాక


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తలపెట్టిన అయుత మహా చండీయాగం ఆఖరి దశకు చేరుకుంది. నేడు ఐదవ రోజు యాగం జరుగుతుండగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పలువురు ఏపీ మంత్రులు యాగశాలకు వెళ్లనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఎర్రవల్లికి వెళ్తారని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. ఆపై మధ్యాహ్న సమయంలో ప్రణబ్ ముఖర్జీ యాగంలో పాల్గొంటారు. దీంతో విస్తృత బందోబస్తు చేసిన పోలీసులు ఉదయం నుంచే సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గౌరారం నుంచి పాములపర్తి, ఎర్రవల్లి రహదారిలో వాహన ఆంక్షలు విధించారు. సాధారణ ప్రజలు యాగానికి వెళ్లాలనుకుంటే ప్రజ్ఞాపూర్ మీదుగా వెళ్లాలని సూచించారు.

  • Loading...

More Telugu News