: సోమవారం వేములవాడ పర్యటనకు కేసీఆర్ కుటుంబం!
అయుత చండీయాగం ముగిసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ పర్యటనకు వెళ్లనున్నారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా సోమవారం ఈ పర్యటనకు వెళతారని సమాచారం. రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకుని, కేసీఆర్ ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. కాగా, కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి ప్రజలు, ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ స్టార్లు, మీడియా అధినేతలు, పీఠాధిపతులు, స్వామిజీలు, ప్రత్యేక ఆహ్వానితులు భారీ సంఖ్యలోనే హాజరవుతున్నారు. ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు వెళ్లనున్నారు.