: మహిళల వస్త్రధారణకు, మగాళ్ల ప్రవర్తనకు సంబంధమే లేదు: రేణుదేశాయ్


మహిళల వస్త్ర ధారణకు, మగాళ్ల ప్రవర్తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ అభిప్రాయపడింది. స్లీవ్ లెస్, షార్ట్ లెంగ్త్, జీన్స్ వంటి దుస్తులు ధరించిన అమ్మాయిలను, నిండుగా కప్పుకున్న వస్త్రాలు ధరించిన అమ్మయిలను ఓకే విధంగా మగాళ్లు తేరిపార చూస్తారని రేణు పేర్కొంది. తాను చెప్పిన విషయం వాస్తవమనడానికి ఈ ఫొటోనే నిదర్శనమంటూ ఆమె ఒక ఫొటోనూ కూడా పోస్టు చేసింది. మగాళ్ల బుద్ధే అంత అని, వారి చూపులు ఆ విధంగానే ఉంటాయని రేణు ట్వీట్ చేసింది. కాగా, ఆ ఫొటోలో బురఖాలు ధరించిన ఇద్దరు అమ్మాయిలను బైకుపై కూర్చున్న ఇద్దరు యువకులు కన్నార్పకుండా చూస్తున్న దృశ్యం కనిపిస్తుంది.

  • Loading...

More Telugu News