: మాంసాహారం లేదన్న వార్త అవాస్తవం: ఎయిర్ ఇండియా అధికారులు!


ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి అందించే ఆహారపదార్థాల జాబితా నుంచి మాంసాహార భోజనాన్ని తొలగించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. శాకాహారంతో పాటు మాంసాహారం కూడా వడ్డిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా లంచ్, డిన్నర్ సమయాల్లో టీ, కాఫీలను జనవరి 1నుంచి తొలగించాలని నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయని... అవి కూడా అవాస్తవమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విమానయాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) మహేశ్ శర్మ మాట్లాడుతూ, ఫలహారాలు తప్పా, పాత ఆహార పట్టికలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News