: ఇంగ్లాండ్ లో కుప్పకూలిన పురాతన పబ్!


ఇంగ్లాండ్ లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో రెండు వందల ఏళ్ల నాటి పబ్ ఒకటి కుప్పకూలింది. సమ్మర్ సీట్ ప్రాంతంలోని ఇర్వెల్ నదిపై కట్టిన వంతెన మీద ఈ పబ్, రెస్టారెంట్ భవనం ఉండేది. భారీ వర్షాల కారణంగా ఈ నదికి వరదలు రావడంతో ఈ సంఘటన జరిగింది. కాగా, ఇక్కడ భారీ వరదల కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లాంక్ షైర్ లోని వాలీ, రిబ్ చెస్టర్ ప్రాంతాల ప్రజలు ఇప్పటికే ఇళ్లు వదిలి వెళ్లిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News