: చండీయాగానికి హాజరైన నాగార్జున
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ప్రముఖులు, సామాన్యులు ఈ యాగానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సినీ నటుడు నాగార్జున, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లు కూడా కాసేపటి క్రితం యాగానికి విచ్చేశారు. వీరికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరిద్దరూ సంప్రదాయబద్ధంగా ఎరుపు రంగు పంచె, కండువా ధరించి యాగశాలలో కూర్చున్నారు. ఈ ఉదయం తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత టి.సుబ్బరామిరెడ్డి తదితరులు విచ్చేశారు.