: సుల్తాన్ బజార్ లో పాత అలైన్ మెంట్ ప్రకారమే మెట్రో రైలు: మెట్రో ఎండీ


హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో పాత అలైన్ మెంట్ ప్రకారమే మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ ప్రకారమే పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్టు చెప్పారు. అసెంబ్లీ ఎదుట కూడా పాత అలైన్ మెంట్ ప్రకారమే మెట్రో పనులు జరగాలని ఆదేశాల్లో తెలిపారన్నారు. పాత అలైన్ మెంట్ కంటే కొత్త అలైన్ మెంట్ తోనే ఎక్కువ నష్టమని గమనించామని వివరించారు. ఇక సుల్తాన్ బజార్ లోని జైన్, ఆర్య సమాజ్ భవనాలకు ఎలాంటి ముప్పు ఉండదని పేర్కొన్నారు. 2వేల గజాల్లో మెట్రో సుల్తాన్ బజార్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామన్నారు. ప్రత్యేకంగా హ్యాకర్స్ ప్యారడైజ్ ను నైట్ బజార్ గా మారుస్తామని చెప్పారు. మరోవైపు నగరంలోని సైఫాబాద్ మెట్రోభవన్ వద్ద సుల్తాన్ బజార్ భవన యజమానుల సంఘం ఆందోళన నిర్వహిస్తోంది. సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో మార్గాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News