: అసదుద్దీన్ నోరు అదుపులో పెట్టుకోవాలి: వీహెచ్
కాంగ్రెస్ నేతలు తమ గత చరిత్ర మరిచి మాట్లాడుతున్నారని, గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం ఎన్ని కుట్రలు పన్నినా అడ్రస్ గల్లంతవుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. అసద్ నోరు అదుపులో పెట్టుకోవాలని హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ హెచ్చరించారు. కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి అసద్ కు లేదన్నారు. ఇప్పుడు వారుంటున్న దారుస్సలాం కాంగ్రెస్ పెట్టిన భిక్షేనని చెప్పారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా పాతబస్తీలో ప్రచారం చేస్తామని వీహెచ్ తెలిపారు.