: కాల్ మనీపై ఇప్పటివరకూ 600 ఫిర్యాదులు అందాయి: కమిషనర్ సవాంగ్
కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటివరకూ 600ల ఫిర్యాదులు అందాయని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ వ్యవహారంలో ఆర్థిక మూలాలపై ఇతర ప్రభుత్వ శాఖలతో కలసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ తరహా నేరగాళ్లపై చర్యలు సాధ్యమని, అందుకు ప్రజలు సహకరించి, ఎలాంటి అక్రమాలు జరిగినా సమాచారం ఇవ్వాలని కమిషనర్ మీడియా సమావేశంలో కోరారు. కాల్ మనీ కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. కల్తీ మద్యం కేసులో విచారణ కొనసాగుతోందని తెలిపారు. విజయవాడలో తాత్కాలిక రాజధాని దృష్ట్యా మరింత నిఘా పెంచామన్నారు. నేరాలను నివారించేందుకు టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామని సవాంగ్ పేర్కొన్నారు.