: ఏపీకి కొత్త రైలు... తిరుపతి నుంచి షిర్డీకి వీక్లీ ఎక్స్ ప్రెస్ మంజూరు


ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర రైల్వే శాఖ కొత్త రైలును మంజూరు చేసింది. బడ్జెట్లో ప్రకటించనప్పటికీ తిరుపతి-సాయినగర్ షిర్డీ మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ లో వీక్లీ ఎక్స్ ప్రెస్ ను మంత్రి ప్రారంభించనున్నారు. దాని రెగ్యులర్ సర్వీసు మాత్రం కొత్త ఏడాదిలో జనవరి 5 నుంచి ప్రతి మంగళవారం ఉదయం 7 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. 2015-16 రైల్వే బడ్జెట్ లో ఏ రాష్ట్రానికీ కొత్త రైళ్లను ప్రకటించలేదు. అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెడతామని తెలిపారు. ఆ క్రమంలోనే ఈ కొత్త ఎక్స్ ప్రెస్ ను మంజూరు చేశారు.

  • Loading...

More Telugu News