: ప్రపంచపు 'భారీ'మనిషి మృతి!
ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడుగా పేరుగాంచిన వ్యక్తి మరణించాడు. మెక్సికో సిటీకి చెందిన ఆండ్రెస్ మోరోనో (38) అనే ఈ భారీకాయుడు గుండెనొప్పి కారణంగా చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 450 కిలోల బరువు ఉండే ఆండ్రెస్ మోరినో గత రెండు నెలల కిందట బరువు తగ్గేందుకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడని స్థానిక వార్తా ఏజెన్సీ తెలిపింది. సర్జరీ తరువాత ఆండ్రెస్ దాదాపు 100 కిలోలు బరువు తగ్గాడట. దాంతో అప్పటి నుంచి అతను మామూలుగానే జీవిస్తున్నాడని, అయితే క్రిస్మస్ రోజున హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు వివరించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే చనిపోయినట్టు తెలిపారు.