: చండీయాగంలో పాల్గొన్న శరద్ పవార్, గవర్నర్ దంపతులు
మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం నాలుగోరోజుకు చేరింది. తొలిరోజు తరువాత నేడు కూడా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు యాగంలో పాల్గొన్నారు. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా యాగ స్థలికి వచ్చారు. ఇక రేపు ఐదోరోజు యాగంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కేసీఆర్ తో గవర్నర్ చర్చించారు. రేపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా చండీయాగానికి వచ్చే అవకాశం ఉంది.